తెలుగు సూర్యుడు /cp broun

తెలుగు సూర్యుడు - సి.పి.బ్రౌన్


                              ఆధునిక సాహిత్యం లో మొట్ట మొదటగా చెప్పుకోదగినటువంటి కవి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్).    సిపి బ్రౌన్ యొక్క కాలం 1798 సంవత్సరం నుండి 1884 సంవత్సరం వరకు జీవించారు.  ఇతని జన్మస్థలమైన కలకత్తాలోనే పుట్టి పెరిగారు. ఇంగ్లాండులో విద్యాభ్యాసం చేశారు. ఇతని వృత్తి ఈస్టిండియా కంపెనీ లో ఉద్యోగిగా పని చేశారు.


సి పి బ్రౌన్ రచించిన రచనలు:-

1. వేమన పద్యాలు

2. తెలుగు వ్యాకరణం

3. ఇంగ్లీషు తెలుగు నిఘంటువు

4. తెలుగు ఇంగ్లీషు నిఘంటువు

5. మిశ్రమ భాషా నిఘంటువు

6. ఆంధ్ర గీర్వాణ ఛందం

7. మీరాశీ  స్వామ్యం 

8. తాతాచారి కథలు

9. కర్నాటిక్ క్రోనాలజీ

10. రాజుల యుద్ధములు 

11. తెలుగు బైబిల్ మొదలగునవి.


సి.పి.బ్రౌన్ గురించి:-

              సి పి బ్రౌన్ గారు తెలుగు ప్రాంతానికి ఉద్యోగిగా వచ్చి మాతృభాష కన్నా తెలుగును మిన్నగా ప్రేమించి తెలుగు భాషా సాహిత్యాలకు విశిష్టమైన సేవ చేసిన మహనీయులుగా గుర్తింపు పొందారు. ఆనాడు అటక మీద నిద్రపోతున్న తాటాకు ప్రతులను బూజు దులిపి వాటికి ముద్రణ భాగ్యం కల్పించిన ఆంగ్లేయుడు సి.పి.బ్రౌన్. అదేవిధంగా వేమనను కేవలం తెలుగు వారికే కాక యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. దాదాపు 2వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను "the verses of vemana" అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసి అచ్చు వేయించారు.


వేమనను గూర్చి:-

 "దేశమునందు నొక్కడు విదేశజనుండు విశాల భావనో

  ద్దేశమునందు జీవిత నిధిన్ మన తెలుగుకు ధారవోసెన్"

అని సన్నిధానం నరసింహశర్మ గారు ప్రశంసించారు. పాశ్చాత్యులు కూడా తెలుగు భాషను నేర్చుకోవడానికి వీలుగా సి.పి.బ్రౌన్ గారు సరళమైన భాషలో తెలుగు వ్యాకరణం రాశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.